- ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం..
- Nirmal జిల్లాలో అక్రమ ఇసుక నిల్వలపై పోలీసుల తనిఖీ
- నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ
- నిల్వలపై పోలీసుల కొరడా భారీగా తనిఖీలు..
- ఎస్పీ జానకి సీరియస్
Nirmal జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా పోలీసు యం త్రాంగం సీరియస్గా దృష్టి సారించింది. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులు పై దాడులు నిర్వహించడంతోపాటు, అక్రమ రవాణా కు అనుకూలంగా ఉన్న వాగులు సహా, ఇసుక రవాణా కు అను కూలంగా ఉన్న ప్రధాన అక్రమ మార్గాలపై పోలీసు యం త్రాంగం దృష్టి పెట్టింది.
భారీగా తనిఖీలు.. అక్రమ నిల్వల గుర్తింపు..
నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ముమ్మర తనిఖీలకు దిగిం ది. గడిచిన రెండు రోజులుగా అక్రమంగా ఉంచిన ఇసుక నిల్వలపై ఆకస్మికంగా గాజుల్ పెట్, రాంనగర్,
ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం..

భారీగా తనిఖీలు.. అక్రమ నిల్వల గుర్తింపు..
మంజులపూర్ ప్రాంతాల్లో తిరిగి సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఎస్పి జానకి షర్మిల తో పాటు నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా, ప ట్టణ సిఐ ప్రవీణ్ కుమార్, అర్బన్ తహసిల్దార్ రాజు, పోలీస్ రెవిన్యూ సిబ్బంది పాల్గొని దాడులు చేపట్టారు. కాగా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించి నేరుగా దాడుల్లో పాల్గొనడం చర్చకు దారితీసింది.
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించిన, నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఇసుక అక్రమ రవాణా అరిక ట్టేందుకు ప్రత్యేక పో లీస్ టీం, స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ లను ఏర్పాటు చేశామని, అనుమతులు లేకుండా జిల్లాలో వేర్వేరు ప్రాంతాలనుండి ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో
అనుమతులు లేకపోతే చర్యలే..
విశ్వసనీయమైన సమాచారం తో 17 ఇసుక రీచ్ లు , 35 ఇసుక నిల్వలను ఉన్నాయని సమాచారం ఉందని ఆమె స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందితో ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ అక్రమ నిల్వలపై సూచనలు ఇవ్వటం జరిగిం దన్నారు. జిల్లాలోని గోదావరి, స్వర్ణ వాగు, శుద్ద వాగు పరిసర ప్రాంతాల్లో నుండి ఇసుక అక్రమ రవాణా తందని తెలిసిందని ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించే పోలీస్ సిబ్బంది కి తగిన సూచనలు చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇసుక అక్రమ నిల్వలపై దాడులకు రెవిన్యూ అధికారులు సహకారం తో సీజ్ చేయాలని తెలియజేసారు. ఇసుక రీచ్ లనుండి ఎవరు అనుమతులు లేకుండా ఇసుక తర లించకుండ చూడాలన్నారు.